Skip to main content

#చైతన్యం_3

"రేయ్ మీకు అంత దూలగా వుంటే బాత్రూమ్ కో లంజల కొంపలకో వెళ్ళి సావండి...
అంతేగానీ పసిపిల్లల మీద ఏంట్రా.."
పైన చెప్పిన వాక్యాలు నా మిత్రుడు తన fb wall పై పెట్టినవి
నిజానికి ఇది తన ఒక్కడి అభిప్రాయం మాత్రమే కాదు చాలా మంది అలానే అనుకుంటున్నారు,కేవలం లైంగిక వాంఛ తీరుకోవడానికి మాత్రమే rape జరుగుతుంది అనే భ్రమలో ఉన్నారు జనాలు. ఏవో ..... కొంపలు అనే పదం చాలా సులువుగా వాడాడు. వేరే దారి లేక లేదా బలవంతంగా వేశ్య వృత్తిలోకి నెట్టబడ్డ మహిళలను అలా సంభోదించడం చాలా తప్పు అవుతుంది అని గ్రహించలేదు అనుకుంటా,చిన్న పిల్లలకు జరిగిన అన్యాయంకు నోరు జారిన మాటగా నేను చూడడం లేదు, ఇది తరతరాలుగా స్త్రీ జాతి పైన పురుష జాతి చూసే చిన్న చూపు ఆనవాళ్లు. నిజంగా స్త్రీ ని గౌరవించడం రాని వాళ్ళు వాడే పదాలు ఇవి.
ఇంకా సదరు మిత్రుడు ఎం అన్నడంటే
"_ఛీఛీ_
మీ లాంటి వాళ్ళని అక్కడికక్కడే అడ్డంగా నరికి చంపకుండా...
మీ మీద కూడా జాలీ చూపిస్తున్న కులగజ్జి గాళ్ళని ఇంకేం చెయ్యాలి....??"
పరిస్థితులు మారకుండా ఎంత మందిని చంపినా అదే మళ్ళీ మళ్ళీ జరిగే అవకాశం ఉంటుంది. అలా చంపుకుంటూ పోతే ఎవ్వరు మిగలరు, వేశ్య వృత్తిలో ఉన్న స్త్రీలను ..జలు అనే పదం వాడినందుకు ముందు అవ్యక్తినే చెమపెయ్యాలి అని జనాలు రోడ్డులు ఎక్కితే....?
అసిఫాను రేప్ చేసిన వాళ్ళమీద జాలి చూపించింది హిందూ మతం, రేప్ చేసిన వాళ్లని హీరోలుగా చేసి అక్కడ ఒక ఊరేగింపు జరిపారు.
ఇంకా ఇలా కూడా సెలవిచ్చరు
"అడవిలో జంతువులు బెటర్రా మీకన్నా ...
మీవల్ల మగ పుట్టుక పుట్టినందుకు సిగ్గుగా ఉందిరా "
ఏ జంతువైనా కోరిక కలిగినపుడు కామం తీర్చుకుంటుంది అలాంటి సౌకర్యం మనిషికి లేదు అని గుర్తించాలి, ఇక్కడ sex గురించి open మాట్లాడం, చర్చిచడం ఓ తప్పుగా పరిగణిస్తున్నారు. ఇలా ఉన్న ఈ సమాజంలో sex పైన అవగాహనా ఎప్పుడు రావాలి...?
మొత్తానికి ఆయన బాధా అంతా మగపుట్టుకకు వాళ్ళు మచ్చ తెస్తున్నారు అని, అంటే మగ పుట్టుక చాలా గౌరవమైనదా ...?? ఏ పుట్టుకైనా ఒక్కటే కదా ఇది కూడా తెలియకుండా చాలా మంది బ్రతికెస్తున్నారు....
Note inverted commas "...." లో ఉన్న content నా పోస్టు కాదు, అది facebook మిత్రుడు post.
అంశాల వారిగా వివరణ ఇవ్వడానికి ఇక్కడ పెట్టాను,గమనించగలరు.

Comments

Popular posts from this blog

#చైతన్యం 2

# చైతన్యం  2 అమ్మాయిల మేకప్ మీద జోకులు షేర్ చేసే వాళ్ళు రేప్ జరిగినప్పుడు,  # RIP   # save_girl # save_girl_child  ani  # tags  పెట్టి మరి పోస్టులు పెడతారు, అమ్మాయి ఎలా ఉంటే వీళ్లకు ఎందుకు...? అలా అనే హక్కు వీళ్లకు ఉందా? Why a girl is being blamed for being in her own style ? ప్రజా ఉద్యమాలలో ఉండే వాళ్ళు కూడా ఈ తరహా మేకప్ మీద జోకులు వేస్తూ ఉంటారు,ఒక అమ్మాయి హెయిర్ కట్ చేయించుకుంటే అది చాలా పెద్ద వార్త ఆ రోజు కోలనిలో, పల్లెల్లో ఇంకా బైక్ నడపడానికి భయపడుతున్నారు అమ్మాయిలు,కింద పడతాం అని కాదు, మాటలు పడతాం అని భయం, ఉత్తర భారతదేశంలో అమ్మయిలు సెల్ ఫోన్ వాడడం ఒక నేరం నేటికి కూడా,ఇది జరుగుతున్న కథ # todays_reality  ,ఈ దేశంలో స్త్రీలు పూజింప బడతారు అని పచ్చి అబద్ధం చాలా సులువుగా చెప్పేస్తాం. అలా చెప్పిన వారిని మీ ఇంట్లో స్త్రీకి ఎలాంటి పూజలు చేస్తారు అని అడిగి తెలుకోవాలి. నాకు తెలిసి నేను చూసిన ఏ ఇంట్లో ఆడళ్ళని పూజించడం లేదు, పూజల్లో పక్కన పెడుతున్నారు అంతే.

#చైతన్యం 1

# చైతన్యం  1 # Big_joke ఎలా వస్తుంది చైతన్యం మన దేశం లో పాలకుల మీద కోపం తప్ప పాలన మీద చైతన్యం మాత్రం ఎప్పుడూ లేదు,చాలా మందికి ఇంకా ఇది హిందూదేశమే, ఆ చాలా మంది పాలకులే కాదు ప్రజలు కూడా, ప్రజాస్వామ్యం అనే పుచుక గూడు కూలిపోయింది ఇక్కడే,మనది ఒక ప్రజాస్వామ్య దేశం అని జనానికి 5 ఏళ్లకోసారి గుర్తుచేస్తారు, దాని అర్థం పూర్తిగా తెలుసుకునే లోపే ఎన్నికల అయిపోతాయి,అప్పటి వరకు opposition party మీదో అధికార పార్టీమీదో వేసిన జోకులు అక్కడే పక్కదారి తీసుకుని పెళ్లాలమీదనో, పని పిల్లలమీదనో మొత్తాన ికి అన్నీ కలిపి ఆడ పిల్ల మీదకే వెళ్లిపోతాయి.రోజూ.. జరుగుతున్న రేపులు వాటికి మనం తీసిన candle ర్యాలీలు పెట్టిన సంతాప సభల అక్కడ ఇచ్చిన నినాదాలు గాలిలో కలిపేసి అదే నీటితో ఆడపిల్ల అంగల మీద జోకులు వేసేస్తాం. రేప్ చేసినోదికి ఉరే సరి అని గట్టిగా అరిచారు కదా. ఇది కూడా సెక్సువల్ harassment పరిధిలోకే వస్తుంది కదా అప్పుడు వీళ్లకు కూడా ఉరే వేసేయ్యాలి కదా !!!!! Sexual harassment మీద మనకున్న అవగాహన ఎంత ? అవగాహన లేకుండా చైతన్యం ఎలా వస్తుంది?