కూతురిని కని కొడుకులా ఎందుకు పెంచాలి?
కూతురు కొడుకు కంటే తక్కువా ?
కూతురిని కుతురిలా ఎందుకు పెంచకూడదు ?
అసలు కూతురిని ఎలా పెంచాలి ?
కూతురు కొడుకు కంటే తక్కువా ?
కూతురిని కుతురిలా ఎందుకు పెంచకూడదు ?
అసలు కూతురిని ఎలా పెంచాలి ?
చాలా ప్రశ్నలు,కొడుకుని కన్నప్పుడు రాని ప్రశ్నలు. అవును ప్రశ్నల్లో ఒక్కటి కూడా కొడుకు పుట్టినప్పుడు రాదు ఎందుకు,ఇప్పుడిప్పుడే కొద్దిగా మారుతున్న ఈ సమాజంలో ఆడపిల్ల అంటే వివక్ష ఇంకా పోలేదు. ఎప్పుడూ నవ్వుతూ ఉండే నా మిత్రుడు ఒక సంవత్సరం క్రితం తన చెల్లికి వాళ్ళ అత్త అనబడే ఒక స్త్రీ కడుపులో ఉన్న మరో స్త్రీని చంపించింది అని చెప్పి పెట్టిన కన్నీళ్లు ఇంకా నా కళ్లముందు కదులుతున్నాయి.చట్టం కుటుంబ గౌరవం ముందు అవిటిదైపోయిన రోజు అది ఒక్క కంప్లైంట్ చాలు అందరూ కటకటాల్లోకి వెళ్ళడానికి కానీ అది జరగదు ఈ దేశంలో, ఇలా ఎన్ని చట్టాలు తెచ్చినా అంతే. మార్పు రవాల్సింది చట్టలో కాదు,అవి పాటించి ఆములు చేసే వాళ్లలో. వస్తుందా అంటే ఎలా వస్తుంది మనం మౌనంగా ఉన్నంత కాలం రాదు.
"ఆడపిల్ల ఒక అడ్డు, ఆడపిల్ల గుండెల మీద బరువు, ఆడపిల్ల అంటే అక్కడ పిల్ల" అనే సోది సామెతలు పట్టుకు వెళ్లాడినంత కాలం రాదు. కొత్త స్లోగన్ ఒకటి చెప్పుకోవాలి మనం "అమ్మాయి చదువు ఇంటికి వెలుగు" ఇది ఇప్పటికీ మన ఉరి గోడలమీద రాస్తున్నారు,అమ్మాయి చదువు కేవలం ఇంటికి మాత్రమే పరిమితం చేశారు.అమ్మయి చదువు ప్రపంచానికి వెలుగు అని చాలా మంది రుజువు చేస్తున్నారు నేడు. నాకు కూతురు పుట్టింది అయిన నేను కొడుకులా పెంచాను అని గర్వంగా చెప్పుకుంటారు చాలామంది అంటే కూతురిని కుతురిలా పెంచడానికి కూడా ధైర్యం లేదా ? ఈ వివక్ష మన ఆలోచనల్లో కలిసిపోయింది. కొడుకులా పెంచడం అంటే ఎలాగో మరి.నాకు తెలిసిన అర్ధం చెప్తా కొడుకులా పెంచడం అంటే స్వేచనిచ్చి పెంచడం,ఆటలకి వెళ్తా అంటే పంపడం,లేట్ గా ఇంటికి వచ్చినా ఎం అనక పోవడం,నచ్చిన బట్టలు వేసుకొనివ్వడం,ఇది పెంపకంలో స్వేచ్ఛకి వాళ్ళు ఇచ్చే నిర్వచనం.అబ్బాయిలా పెంచడం అంటే పుట్టిన మనిషికి స్వేచ్ఛగా పెంచండం అమ్మాయిగా అంటే స్వేచ్ఛ లేకుండా పెంచడం అని చాలా స్పష్టంగా అర్థం అవుతుంది ఇక్కడ. ఇంత స్వేచ్ఛగా పెంచినా మళ్ళీ పెళ్లి పేరుతో కట్నం ఇచ్చి మరీ దానం చేస్తారు.

పెళ్లి చేసుకుని అక్కడ ఉద్యోగం చేసి,ఇంటి పని కూడా ఆమె చెయ్యాలి,భర్త హోదాలో ఆమె క్రేడిట్ మరియు డెబిట్ కార్డ్ కూడా లాగేసుకునే software భర్తలు మాములు కళ్ళతో చూసినా చాలా మంది కనబడతారు.ఇక్కడ కూతురిని ఎలా పెంచాం అనే దానికంటే కొడుకుని ఎలా పెంచుతున్నాము అన్నది చాలా ముఖ్యం.
Let us Raise sons to respect every women in and out of the family.
Comments
Post a Comment